![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -373 లో... ప్రేమ గ్లాస్ తో ఒక గేమ్ ఆడుతుంటే.. ధీరజ్ వచ్చి తనని ఆటపట్టిస్తాడు. దమ్ముంటే నాతో ఆడి గెలవరా అని ప్రేమ అంటుంది. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కాదని ధీరజ్ అంటాడు. సరే రా నీ చెయ్ కి నా చెయ్ టచ్ అయితే నేనే విన్.. నా చెయ్ కి నీ చెయ్ టచ్ అయితే నువ్వు విన్ అని ప్రేమ అంటుంది.
ఒక సర్కిల్ గీస్తుంది. అందులో ఇద్దరు నిల్చుంటారు. ధీరజ్ ని ప్రేమ కొట్టి వెళ్లిపోతుంటే ధీరజ్ తనని పట్టుకుంటాడు. తనకి దగ్గరగా వెళ్లి రొమాంటిక్ గా చూస్తాడు. అప్పుడే తిరుపతి వచ్చి.. ఇక్కడ పెళ్లి కానీ వాళ్ళున్నారు డోర్ వేసుకోవచ్చుగా అని అంటాడు. మరొకవైపు అమూల్యకి విశ్వ ఫోన్ చేసి.. నువ్వు లేకుండా నేను ఉండలేనని అంటాడు. రేపు నాతో వచ్చేయ్ లేచిపోయి పెళ్లి చేసుకుందామని అంటాడు. అప్పుడే వేదవతి పిలుస్తుంటే అమూల్య ఫోన్ కట్ చేస్తుంది. వేదవతి వచ్చేవరకు రింగ్ కింద పడి ఉంటుంది. అదేంటని వేదవతి అనగానే జారిపోయిందని తీసుకుంటుంది. భోజనం చేద్దాంరా అని వేదవతి అనగానే నాకు ఆకలిగా లేదని అమూల్య చెప్తుంది. అదే విషయం వేదవతి వెళ్లి రామరాజుకి చెప్తుంది.
రామరాజు భోజనం తీసుకొని వచ్చి అమూల్యకి తినిపిస్తూ.. నువ్వు మా అమ్మవి.. మా అమ్మ నన్ను మోసం చెయ్యదంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. కాసేపటికి రామారాజు భుజంపై అమూల్య తలవాల్చి ఏడుస్తుంది. అదంతా ప్రేమ, నర్మద చూస్తారు. ఆ తర్వాత అమూల్య ఒంటరిగా బయట కూర్చొని ఉంటుంది. తన చుట్టూ ముగ్గురు అన్నలు వదినలు కూర్చుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |